లైగర్ తో యువీ పోటాపోటీ.. దాని ముందు ముగ్గురి బలమూ దిగదుడుపే.. ఫొటోలివిగో!
- దుబాయ్ ఫేమ్ పార్కులో యువరాజ్ సింగ్ పర్యటన
- లైగర్ తో టగ్ ఆఫ్ వార్
- పార్కులో జంతువులకు ఫీడింగ్
- ఆడసింహానికి నేరుగా మాంసం తినిపించిన క్రికెటర్

అంతేకాదు.. పార్క్ అంతా కలియతిరుగుతూ అడవి జంతువులకు ఆహారం పెడుతూ సరదాగా గడిపాడు యువీ. ఓ ఆడ సింహానికి నేరుగా మాంసం తినిపిస్తూ కనిపించాడు. ఆ టూర్ కు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘‘టైగర్ వర్సెస్ లైగర్.. చివరకు ఎవరు గెలిచారో అందరికీ తెలుసు కదా. భయాలన్నీ పక్కనపెట్టి ప్రకృతి, అడవి అందాలతో ఓ మధురానుభూతిని సంపాదించుకున్నాను’’ అని రాసుకొచ్చాడు. ఓ సురక్షితమైన వాతావరణంలో అన్ని జంతువులనూ ఫేమ్ పార్కులో సంరక్షిస్తారన్నాడు. జంతువుల బాగోగులను చూసేందుకు సుశిక్షితులైన సిబ్బంది ఉంటారని చెప్పుకొచ్చాడు.