అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించడంపై అల్లు అర్జున్ స్పందన
- నేడు అల్లు రామలింగయ్య 100వ జయంతి
- రాజమండ్రిలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు
- చిరంజీవి మాటలు హృదయాన్ని తాకాయన్న బన్నీ
- చిరంజీవికి హృదయపూర్వక కృతజ్ఞతలు
రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి గారు ఆవిష్కరించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. చనిపోయిన మా తాతగారి గురించి చిరంజీవి గారు మాట్లాడిన మాటలు హృదయానికి హత్తుకున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు నేను, మా అల్లు కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అని వెల్లడించారు.