Google: మరో 100కి పైగా యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్

Google deletes hundred more apps due to Grift Horse malware
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల గ్రిఫ్ట్ హార్స్ అనే మాల్వేర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది యాప్ ల ద్వారా మొబైల్ ఫోన్లలో తిష్టవేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. జింపెరియమ్ అనే సైబర్ భద్రత సంస్థ గ్రిఫ్ట్ హార్స్ పై ఆయా టెక్ సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ డేంజరస్ మాల్వేర్ కారణంగా ఆండ్రాయిడ్ యూజర్లు కోట్లాది రూపాయలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో గూగుల్ కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గ్రిఫ్ట్ హార్స్ మాల్వేర్ కలిగివున్న 136 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ ల జాబితాను ప్రకటించిన గూగుల్... ఆయా యాప్ లు ఎవరి ఫోన్ లో అయినా ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. గ్రిఫ్ట్ హార్స్ అనేది ట్రోజన్ రకానికి చెందిన మాల్వేర్. ఇది ఓ మొబైల్ లో చొరబడితే అందులోని యాప్ లు అన్నింటిని మాల్వేర్లుగా మార్చేస్తుంది.




Go Back to Shorts
Google
Apps
Playstore
Grift Horse
Malware

More Telugu News