వ్యాక్సిన్ వేయించుకున్నా.. 30 మంది మెడికల్ స్టూడెంట్స్ కి కరోనా పాజిటివ్!
- ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో కరోనా కలకలం
- 30 మందిలో 28 మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక విద్యార్థి
ఈ కాలేజీలో మొత్తం 1100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. 30 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇతర విద్యార్థులకు కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 200 నుంచి 250 మందికి పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఈ వారంలో బెంగళూరులోని ఒక రెసిడెన్సియల్ పాఠశాలలో 60 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో, అక్టోబర్ 20 వరకు స్కూల్ ను మూసేశారు.