మంత్రి పేర్ని నాని ఇంటికి వెళ్లిన సినీ నిర్మాతలు

Tollywood producers went to Perni Nani home
  • జనసేన, వైసీపీ మధ్య పేలుతున్న మాటలు తూటాలు
  • పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని
  • తాజా వివాదంపై నానితో చర్చిస్తున్న నిర్మాతలు
వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత పవన్ పై మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది జరిగిన తర్వాత కూడా పవన్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో... ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటికి సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు వెళ్లారు. నిర్మాతలు వస్తున్నట్టు నిన్ననే పేర్ని నానికి మధ్యవర్తులు సమాచారం పంపించారు. కాసేపటి క్రితం వీరంతా మంత్రి ఇంటికి వెళ్లారు. తాజా వివాదం నేపథ్యంలో వీరు చర్చిస్తున్నారు.
Go Back to Shorts
Perni Nani
YSRCP
Pawan Kalyan
Janasena
Tollywood
Producers

More Telugu News