Nagaskourya: 'లక్ష్య' రిలీజ్ డేట్ ఖరారు .. అధికారిక పోస్టర్ విడుదల!

Lakshya movie release date confirmed
షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా నాగశౌర్య విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వరుడు కావలెను' రెడీ అవుతోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు.

ఇక ఆ తరువాత సినిమాగా 'లక్ష్య' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇది విలువిద్యకి సంబంధించిన కథ .. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథ. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. నాగశౌర్య జోడీగా కేతిక శర్మ నటించగా, ఒక కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు.
Go Back to Shorts
Nagaskourya
Kethika Sharma
Jagapathi Babu

More Telugu News