కేసీఆర్ బంద్ లో పాల్గొనకుండా, మోదీతో విందు చేసుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
- ప్రధాని ఏం మాయ చేశారోగానీ.. సీఎం పూర్తిగా మారిపోయారు
- రైతు చట్టాలకు మద్దతిచ్చి ఇప్పుడేమో మాట్లాడట్లేదు
- మోదీ, కేసీఆర్ పాలనలో పేదల బతుకులు దుర్భరం
- భారత్ బంద్ నిరసనల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని మండిపడ్డారు. ఇవాళ్టి బంద్ లో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా, మోదీతో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. నూతన సాగు చట్టాలు రైతులకు మరణ శాసనాలేనని, వాటితో రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగును అదానీ, అంబానీలకు మోదీ తాకట్టు పెట్టారని రేవంత్ ఆరోపించారు.