పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా కడియం సీఐ.. వీఆర్‌కు పంపిన అధికారులు
- రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఘటన
- తీవ్రంగా పరిగణించిన డీఐజీ కార్యాలయం
- కడియం ఇన్‌చార్జ్ సీఐగా రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ రాంబాబు
ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం నిన్న ఆయనను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలిందని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్‌రావు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. అప్పటి వరకు ఆయన వీఆర్‌లోనే ఉంటారని పేర్కొన్నారు. అలాగే, రాజమహేంద్రవరం రెండో పట్టణ సీపీఎస్ సీఐ రాంబాబును కడియం ఇన్‌చార్జ్ సీఐగా నియమించినట్టు తెలిపారు.