తెలంగాణ పర్వతారోహకుడికి భారీ ఆర్థిక సాయాన్ని అందించిన జగన్
- ఎవరెస్ట్ సహా ఐదు ఖండాల్లోని శిఖరాలను అధిరోహించిన తుకారామ్
- తుకారామ్ ను అభినందించిన జగన్
- రూ. 35 లక్షల చెక్కును అందించిన సీఎం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను తుకారామ్ కలిశాడు. తన పర్వతారోహణ వివరాలను సీఎంకు వివరించాడు. ఈ సందర్భంగా తుకారామ్ ను జగన్ అభినందించారు. ఆయనకు రూ. 35 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా తుకారామ్ మాట్లాడుతూ, తనపై జగన్ చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు.