దీపికా పదుకొణె పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యుండేది.. పొగడ్తలతో ముంచెత్తిన పీవీ సింధు
- ఇటీవల గేమ్ ఆడిన దీపిక, సింధు
- ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన దీపిక
- మంచి కెరీర్ ఉండేదన్న సింధు

పీవీ సింధు వరల్డ్ చాంపియన్ షిప్ కోసం ప్రాక్టీస్ చేస్తోందని, చాంపియన్ షిప్ కు సిద్ధమయ్యేందుకు తానే సరైన భాగస్వామి అని భావించిందని దీపిక కామెంట్ చేసింది. ఇటు సింధు కూడా దీపికను పొగిడింది. బ్యాడ్మింటన్ లోకి దీపిక వచ్చి ఉంటే కనుక విజయవంతమయ్యేదని వ్యాఖ్యానించింది. టాప్ ప్లేయర్ గా ఎదిగేదని కామెంట్ చేసింది. కాగా, పీవీ సింధు, దీపికా పదుకొణె మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇటీవల రణ్ వీర్ సింగ్ తో కలిసి వారిద్దరూ ఓ రెస్టారెంట్ లో కనిపించారు.