"తెలివైన పిల్లవాడు నరేంద్ర"... బాల్యంలో మోదీ సాహసాలపై ఏపీ బీజేపీ ట్వీట్
- సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోదీ
- దేశ ప్రధాని అయిన వైనం
- ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్
- బాల్యంలో మోదీ మొసలిని పట్టుకున్నాడని వెల్లడి
కేవలం ఏడెనిమిదేళ్ల వయసులోనే మోదీ మొసళ్లతో నిండిన సరస్సులో ఈత కొట్టేవాడని వెల్లడించింది. అంతేకాకుండా, ఆ సరస్సులో ఓ మొసలి పిల్లను పట్టుకుని ఇంటికి కూడా తీసుకువచ్చాడని, అయితే ఆయన తల్లి వద్దని చెప్పడంతో తిరిగి ఆ మొసలిని సరస్సులో వదిలిపెట్టాడని ఏపీ బీజేపీ తన ట్వీట్ లో వివరించింది. బాల్యంలో మోదీ ఓ ఆలయ శిఖరంపై జెండా కూడా ఎగురవేశాడని తెలిపింది.
కాగా, ఏపీ బీజేపీ తన ట్వీట్ తో పాటు ఓ ఆసక్తికర చిత్రాన్ని కూడా పంచుకుంది. అందులో నీటిలో దిగిన మోదీ మొసలిపిల్లను పట్టుకోగా, ఒడ్డున ఉన్న మిగతా బాలలు భయాందోళనలకు గురికావడం ఆ చిత్రంలో చూడొచ్చు. అయితే, ఏపీ బీజేపీ చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి వ్యతిరేక దిశలో వ్యాఖ్యలు వస్తున్నాయి.