Sonu Sood: తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే: సోను సూద్

If I did mistake ready to face any punishment says Sonu Sood
  • ఐటీ అధికారులు వారి పని వారు చేశారు
  • నేను కూడా నా పని చేసుకుంటూ పోతాను
  • ఇంతకు ముందు కంటే ఎక్కువ జోష్ గా ఉన్నా
ప్రముఖ సినీ నటుడు సోను సూద్ నివాసాలు, కార్యాలయాలలో ఐటీ తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సోదాలు జరిగాయి. దీనిపై సోను మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పులు చేయలేదని అన్నారు. దాచిపెట్టేందుకు ఏమీ లేదని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. ఐటీ అధికారులు వారి పని వారు చేశారని చెప్పారు. తాను కూడా తన పని తాను చేసుకుంటూ పోతానని అన్నారు.

తాను ఉన్నా, లేకపోయినా... తాను ప్రారంభించిన సేవా కార్యక్రమాలు మాత్రం ఆగకూడదని సోను సూద్ చెప్పారు. తన ఇంటి ముందు వందలాది మంది ఉంటున్నారని... వారంతా తన యోగక్షేమాల కోసం తల్లడిల్లుతున్నారని అన్నారు. చాలా మంది ఏడ్చేస్తున్నారని చెప్పారు. వారి వల్లే ఐటీ రైడ్స్ తర్వాత కూడా ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని అన్నారు. ఇంతకు ముందెన్నడూ లేనంత జోష్ గా ఉన్నానని చెప్పారు.
Sonu Sood
toll
Bollywood
IT Raids

More Telugu News