Telangana: పిల్లాడి కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటపడిపోయిన కేటీఆర్.. వీడియో ఇదిగో!

KTR Loved This Boy Confidence Level Shares Video
  • పేపర్ వేస్తూ చదువుకుంటున్న జగిత్యాల చిన్నారి
  • పేపర్ ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నించిన స్థానికుడు
  • ఏం వేయకూడదా? అంటూ ఎదురు ప్రశ్నించిన చిన్నారి
  • ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్ లో బాగుంటామని కామెంట్
  • ఆ వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
పిల్లాడే గానీ.. ఆ చిన్నారిలో ఆత్మవిశ్వాసం చూస్తే మాత్రం అచ్చెరువొందక తప్పదు. అవును మరి, ఆ బాలుడు తన జీవితం గురించి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆ చిన్నారి పేరు శ్రీ ప్రకాశ్. తెలంగాణలోని జగిత్యాల పట్టణం అతడి ఊరు. చదువుకుంటూనే న్యూస్ పేపర్ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే పేపర్ వేస్తున్న ఆ చిన్నారిని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పలకరించాడు.

చదువుకోవాల్సిన వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్? అని అడిగాడు. దీంతో ఆ అబ్బాయి.. ‘‘ఏం పేపర్ వేయకూడదా? అదేమైనా తప్పా? చదువుకుంటూనే పనిచేస్తున్నా. దాంట్లో తప్పేముంది?’’ అంటూ ఆ వ్యక్తికి సమాధానమిచ్చాడు. తన పేరు శ్రీ ప్రకాశ్ అని, స్థానిక ఓల్డ్ హైస్కూల్ చదువుతున్నానని చెప్పాడు. 'ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్ లో బాగుంటాం కదా!' అంటూ పెద్ద ఆరిందాలా ఆ చిన్నారి చెప్పుకొచ్చాడు.

అతడి మాటలకు మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. అతడి ఆత్మవిశ్వాస స్థాయులు అమోఘమని కొనియాడారు. ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు అన్నీ సూపర్ అన్నారు. చదువుకుంటూ పనిచేయడంలో తప్పేముందన్న అతడి క్లారిటీ చూస్తే ముచ్చటేస్తోందని మెచ్చుకున్నారు.
Telangana
KTR
Jagtial District
Paper Boy

More Telugu News