Budda Venkanna: 23 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీని ప్రారంభించింది ఈ రోజే: బుద్ధా వెంక‌న్న‌

budda venkanna slams jagan
  • జగన్ రెడ్డి అక్రమంగా సంపాదించి జైల్ కి వెళ్లారు
  • చంద్ర‌బాబు మాత్రం విజ‌న్‌తో ప‌నిచేశారు
  • ఇక్కడో అద్భుతం పురుడు పోసుకోబోతుందని చెప్పారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్‌లో చేసిన అభివృద్ధి ప‌నుల‌ను, జ‌గ‌న్ తీరును ఆయ‌న ప్ర‌స్తావించారు.

'జగన్ రెడ్డి అక్రమంగా సంపాదించి జైల్ కి వెళ్లి ఎనిమిది సంవత్సరాల క్రితం కండీష‌నల్ బైయిల్ పైన ఇదే రోజు బయటకి వచ్చాడు. 23 సంవత్సరాల క్రితం కొన్ని తరాలు అత్యుత్తమ ఉద్యోగాలు చేసేలా చంద్రబాబు దార్శనికతతో హైటెక్ సిటీని ప్రారంభించింది ఈ రోజే' అని బుద్ధా వెంక‌న్న చెప్పారు.
 
'ఈ ఫొటో తీసిన టైంలో, ఇక్కడో అద్భుతం పురుడు పోసుకోబోతుంది అని, ఆ ఫోటో ముందు విక్టరీ సింబల్ చూపిస్తున్న ఈ విజనరీకి మాత్రమే తెలుసు.. (ఆయన సహచరులు సహా అందరూ ఎగతాళి చేసినవారే)' అని బుద్ధా వెంక‌న్న చెప్పారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఫొటో పోస్ట్ చేశారు.   
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News