బిగ్ బాస్ షో స్క్రిప్టు కాదు... రియల్ షో: ఉమాదేవి
- రెండోవారంలో ఎలిమినేట్ అయిన ఉమాదేవి
- తన ఎలిమినేషన్ పట్ల విచారం వ్యక్తం చేసిన నటి
- తన మాటతీరు పట్ల పొరబడ్డారని వెల్లడి
- చాన్స్ వస్తే మళ్లీ వెళతానని ఆశాభావం!
ఇక తన ఎలిమినేషన్ పట్ల ఉమాదేవి విచారం వ్యక్తం చేసింది. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, కానీ బిగ్ బాస్ ఇంటి సభ్యులు తన మాటతీరును సరిగా అర్థం చేసుకోలేకపోయారని అభిప్రాయపడింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండుంటే ఇంకా వినోదం పంచేదాన్నని, రెండో వారానికే ఎలిమినేట్ కావడం బాధాకరమని పేర్కొంది. అవకాశం ఇస్తే మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించింది.