కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్... ఇద్దరు పైలట్ల దుర్మరణం
- జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్
- హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు
- గత నెలలో కూడా జమ్మూకశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ దురదృష్టవశాత్తు వారిని దక్కించుకోలేకపోయామని ఈ సందర్భంగా ఓ ఆర్మీ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. తుక్కుతుక్కయిపోయిన హెలికాప్టర్ నుంచి గాయపడ్డ పైలట్లను స్థానికులు బయటకు తీస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ఈ వార్త వినగానే చలించిపోయానని చెప్పారు. జమ్మూకశ్మీర్ లోని కథువాలో గత నెలలో కూడా హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రత్నసాగర్ డ్యామ్ లోకి ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. పైలట్ ఆచూకీ ఇంత వరకు లభించలేదు.