Space X: రోదసీ యాత్ర దిగ్విజయం.. 3 రోజుల తర్వాత భూమ్మీదకు తిరిగొచ్చిన నలుగురు సామాన్యులు.. వీడియో ఇదిగో

Inspiration 4 Crew Back To The Earth After 3 Days Of Roaming In Space Their Crew Capsule Splash Down in Florida Coast
  • విజయవంతంగా ముగిసిన ఇన్ స్పిరేషన్ 4 ప్రయోగం
  • మూడు రోజుల పాటు కక్ష్యలో గడిపిన టూరిస్టులు
  • ఇవాళ ఫ్లోరిడా తీరంలో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్
స్పేస్ ఎక్స్ నిర్వహించిన ఇన్ స్పిరేషన్ స్పేస్ టూర్ విజయవంతంగా పూర్తయింది. మూడు రోజుల పాటు అంతరిక్షంలో భూకక్ష్యలో గడిపిన నలుగురు సామాన్యులు తిరిగి భూమ్మీదకు వచ్చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో వారి క్రూ క్యాప్సూల్ డ్రాగన్ సురక్షితంగా దిగింది. పూర్తి స్థాయి ఆస్ట్రోనాట్లు లేకుండానే నలుగురు సామాన్యులు రోదసీలోకి వెళ్లిరావడం ఇదే తొలిసారి కావడం విశేషం.


‘ఇన్ స్పిరేషన్ 4’ పేరిట ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మూడు రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఫాల్కన్ 9 హెవీ రాకెట్ ద్వారా డ్రాగన్ క్రూ క్యాప్సూల్ లో జరెడ్ ఐజాక్ మ్యాన్, క్రిస్ సెంబ్రోస్కీ, హేలీ ఆర్బినో,  సియాన్ ప్రోక్టర్ లు అంతరిక్షంలోకి వెళ్లారు. మామూలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) 420 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుంది.

కానీ, ఈ ప్రయోగంలో భాగంగా దాని కన్నా ఎత్తులో డ్రాగన్ క్యాప్సూల్ కక్ష్యలోకి వెళ్లింది. 575 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరిగింది. గంటకు 27,360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన డ్రాగన్.. 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేసింది. ఈ ప్రయోగం సక్సెస్ తో మానవసహిత అంతరిక్ష యాత్రల్లో మరో ముందడుగు పడినట్టయింది.

Space X
Elon Musk
Inspiration 4
Space Tour
Dragon
USA

More Telugu News