Tollywood: మహేశ్​ బాబుతో ఎన్టీఆర్​ గేమ్​..!

Mahesh Babu To Appear In Evaru Meelo Koteeshwarulu Along Jr NTR
  • దసరా స్పెషల్ ఎపిసోడ్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’
  • షోకు రావడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్!
  • త్వరలోనే షూటింగ్ ప్రారంభం
మహేశ్ బాబుతో కలిసి ఎన్టీఆర్ గేమ్ ఆడబోతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ కు టాలీవుడ్ ప్రిన్స్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇప్పటికే ఈ దఫా సీజన్ లో మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. రేపు ప్రారంభం కాబోయే ఎపిసోడ్ లో దర్శక దిగ్గజాలు రాజమౌళి, కొరటాల శివలు గేమ్ ఆడనున్నారు.

ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబుతోనూ షో నిర్వాహకులు ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గేమ్ ఆడేందుకు మహేశ్ కూడా ఓకే అనేశారని సమాచారం. దసరా రోజున ఆ స్పెషల్ ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నట్టు సమాచారం. అతి త్వరలోనే మహేశ్ గేమ్ ను షూట్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇద్దరి కాంబోలో షో ప్లాన్ చేయడం పట్ల అభిమానులు, నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.
Tollywood
Jr NTR
Junior NTR
Mahesh Babu
Ramcharan
Evaru Meelo Koteeshwarulu

More Telugu News