ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు... హైదరాబాదులో సైమా అవార్డుల పండుగ!
- కన్నుల పండుగలా సైమా అవార్డుల ఫంక్షన్
- హైదరాబాదులో కార్యక్రమం
- రెండ్రోజుల పాటు జరగనున్న వేడుక
- హాజరైన దక్షిణాది తారలు
- మహర్షి చిత్రానికి మహేశ్ బాబుకు అవార్డు
సైమా విశేషాలు...
- 2019లో ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు (మహర్షి)
- మహర్షి చిత్రంలో 'ఇదే కదా..' పాటకు ఉత్తమ గీత రచయితగా శ్రీమణి.
- మజిలి చిత్రానికి గాను 'ప్రియతమ ప్రియతమ' పాటకు ఉత్తమ గాయనిగా చిన్మయి శ్రీపాదకు పురస్కారం.
- ఇస్మార్ట్ శంకర్ లో టైటిల్ సాంగ్ ఆలపించిన అనురాగ్ కులకర్ణికి ఉత్తమ గాయకుడిగా అవార్డు.
- ఉత్తమ తొలి చిత్రం అవార్డు కేటగిరీలో స్టూడియో 99కి పురస్కారం. 'మల్లేశం' చిత్రానికి ఈ అవార్డు ప్రదానం. స్టూడియో 99 తరఫున అవార్డును దిల్ రాజు అందుకున్నారు.
- అరంగేట్రంలో అద్భుత నటన కనబర్చిన కేటగిరీలో శివాత్మిక రాజశేఖర్ కు బెస్ట్ డెబ్యూ అవార్డు.
- బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో కోడూరి శ్రీసింహాకు అవార్డు. 'మత్తు వదలరా' చిత్రానికి గాను పురస్కారం.
- ఏజెంట్ సాయి శ్రీనివాస్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా స్వరూప్ కు అవార్డు.

