'భీమ్లా నాయక్'లో రానా జోడీ ఖరారు కాలేదట!
- షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
- పవన్ పోర్షన్ చాలావరకూ పూర్తి
- ఇక రానా పోర్షన్ పై పూర్తి దృష్టి
- జనవరి 12వ తేదీన విడుదల
ఇక ఇటీవల విదేశాలకి వెళ్లిన రానా తిరిగిరావడంతో, ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్య మీనన్ నటించింది. రానా జోడిగా ఐశ్వర్య రాజేశ్ పేరు వినిపించింది. కానీ ఇపుడు ఆమె చేయడం లేదని తెలుస్తోంది.
ఐశ్వర్య రాజేశ్ డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో, ఈ పాత్ర కోసం ముగ్గురు కథానాయికలను అనుకున్నారట. ఆ జాబితాలో మాళవిక నాయర్ .. మాళవిక మోహన్ .. సంయుక్త మీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. సంయుక్త మీనన్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.