చంద్రబాబు అలా చేసినప్పుడు అయ్యన్న ఎక్కడికెళ్లారు: రోజా ఫైర్

  • ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
  • కోడెలను చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారన్న రోజా
  • అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిని ప్రజలు పీకేశారని ఎద్దేవా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ఆయన విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ స్పీకర్ కోడెలకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేశారని, అప్పుడు ఈ అయ్యన్న ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.  

అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, అడ్డదారిన మంత్రి అయిన లోకేశ్ పదవిని ప్రజలు పీకేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించాలన్న నిర్ణయంపై రోజా మాట్లాడుతూ.. చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ బెల్ట్ షాపులను తొలగించారని, 33 శాతం మద్యం దుకాణాలను ఎత్తివేశారని రోజా పేర్కొన్నారు.


More Telugu News