ఎగువ నుంచి భారీ వరద.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
- ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు
- నాగార్జున సాగర్ కు 1,95,881 క్యూసెక్కులు
- జల విద్యుత్ ద్వారా మరో 58,561 క్యూసెక్కుల విడుదల
ఎగువ జూరాల నుంచి శ్రీశైలానికి 1,25,731 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 38,799 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 884.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో 214.3637 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.