'మాచర్ల నియోజకవర్గం'లో చేరిన నిధి అగర్వాల్!
- తొలి రెండు సినిమాలు ఫ్లాప్
- 'ఇస్మార్ట్ శంకర్'తో దొరికిన హిట్
- తమిళంలోను బిజీ
- తెలుగులో పెరుగుతున్న అవకాశాలు
'ఇస్మార్ట్ శంకర్'లో అందాల ఆరబోత తరువాత తమిళ సినిమాల వైపు దృష్టి పెట్టింది. అక్కడ ఆమె ప్రయత్నాలు ఫాస్టుగానే ఫలించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాలోను అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక తాజాగా నితిన్ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందుతోంది. శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. మరో కథానాయికగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చూస్తుంటే తెలుగులో నిధి జోరు పెరగనున్నట్టే అనిపిస్తోంది.