ఎట్టకేలకు తన కారుకు రూ.40 లక్షల పన్ను చెల్లించిన కోలీవుడ్ హీరో విజయ్
- విదేశాల నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి
- 2012లో పన్నుమినహాయింపు కోరిన విజయ్
- విజయ్ కి అక్షింతలు వేసిన మద్రాస్ హైకోర్టు
- లక్ష జరిమానా కట్టాలంటూ ఆదేశాలు
విజయ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇటీవల మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల జరిమానా కట్టాలని, ఆ మొత్తాన్ని తమిళనాడు సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరిమానాతో పాటు, కారుకు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.40 లక్షలను కూడా విజయ్ చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు నివేదించాయి.