డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన సినీనటి ముమైత్‌ఖాన్.. వీడియో ఇదిగో
- ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు
- నేడు ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతాల పరిశీలన
- డ్రగ్స్ సరఫరాదారులతో ఆమె సంబంధాలపై ఆరా
ఇదే కేసులో నోటీసులు అందుకున్న నేపథ్యంలో ముమైత్ ఖాన్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరైంది. ముమైత్ ఖాన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే, డ్రగ్స్ సరఫరాదారులతో ఆమెకున్న సంబంధాలు, జరిపిన సంప్రదింపులపై ఆరా తీస్తున్నారు.
కాగా, గత రెండు వారాలుగా ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. రోజుకి ఒకరిని కార్యాలయానికి పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారిస్తున్నారు.