చైనా, రష్యాలు రివర్స్ ఇంజినీరింగ్ కు పాల్పడితే..?: డొనాల్డ్ ట్రంప్ ఆందోళన
- ఆప్ఘన్ లో 80 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను వదిలి వెళ్లిన అమెరికా బలగాలు
- రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా ఆ ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే అవకాశం
- ప్రపంచమంతా ఇబ్బంది పడే అవకాశం ఉందన్న ట్రంప్
ఈ ఆయుధాలపై చైనా, రష్యాలు కన్నేసి... వాటిపై రివర్స్ ఇంజినీరింగ్ చేస్తే అంతకంటే అవమానం అమెరికాకు మరొకటి ఉండదని ట్రంప్ అన్నారు. రివర్స్ ఇంజినీరింగ్ కు పాల్పడటంలో ఆ రెండు దేశాలు దిట్ట అని వ్యాఖ్యానించారు. రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా ఆయుధాల టెక్నాలజీని ఉపయోగించి, ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఆయుధాలు చివరకు తాలిబన్లకు కూడా చేరే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా యావత్ ప్రపంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు.