కల్తీ మాంసం, చేపలు అమ్మేందుకే మటన్ మార్టులా?: ఏపీ ప్రభుత్వంపై బుద్ధా వెంకన్న విమర్శలు
- బలహీన వర్గాల కడుపుకొట్టేందుకే ఈ నిర్ణయం
- విజయసాయి రెడ్డి సలహాతోనే జగన్ నిర్ణయం
- వారి ఖజానా నింపుకొనేందుకే మటన్ మార్టులు
ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోతున్నారని విమర్శించిన ఆయన.. ఇప్పుడు కల్తీ మాంసం, చేపలను అమ్మేందుకే కొత్తగా ఈ మటన్ మార్టులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి సలహాతోనే ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, వారి ఖజానా నింపుకొనేందుకే ఈ నిర్ణయమని అన్నారు. కొత్త సంస్థలను తీసుకొచ్చే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. మాంసం అమ్మకాల కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్న మటన్ మార్టుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.