'భళా తందనాన' నుంచి కేథరిన్ లుక్ రిలీజ్!
- శ్రీ విష్ణు హీరోగా 'భళా తందనాన'
- శశిరేఖ పాత్రలో కేథరిన్
- విలన్ గా 'గరుడ' రామ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఆమె తాజా చిత్రంగా 'భళా తందనాన' సినిమా రూపొందుతోంది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున కేథరిన్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకు శుభాకాంక్షలు అందజేసింది. ఆమె పాత్ర పేరు 'శశిరేఖ' అనే విషయాన్ని రివీల్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
వారాహి బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా 'గరుడ' రామ్ కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా కేథరిన్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.