Police: గుంటూరు జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిది మంది అరెస్టు
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరైన సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గత రాత్రి బైక్‌పై తిరిగి బయలుదేరి వెళ్తుండగా వారిని అడ్డగించిన దుండగులు మహిళ భర్తపై దాడి, మహిళపై అత్యాచారం చేశారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పురోగతి సాధించారు. దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి, పాలడుగు దగ్గర కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేసే ఎనిమిది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారందరూ ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.