20 మిలియన్ వ్యూస్ ను టచ్ చేసిన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్!

పవన్ కల్యాణ్ - సాగర్ కె చంద్ర కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించనున్నారు. ఈ నెల 2వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

తాజాగా ఈ పాట 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సంపాదించుకుంది. ఇంకా అదే జోరును కొనసాగిస్తోంది. ఇది మలయాళంలో ఆ మధ్య విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. మరో ప్రధానమైన పాత్రలో రానా నటిస్తుండగా, కథానాయికలుగా నిత్యామీనన్ - ఐశ్వర్య రాజేశ్ అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.



More Telugu News