మంద‌ కృష్ణ మాదిగను క‌లిసిన వైఎస్ ష‌ర్మిల‌.. ఈ నెల‌ 12న ద‌ళిత భేరి

sharmila meets manda krishna madiga
  • మంద‌కృష్ణ‌ను ప‌రామ‌ర్శించిన ష‌ర్మిల‌
  • ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి
  • త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్ష
  • 12న నిర్వహించే ద‌ళిత భేరి బహిరంగ స‌భ‌కు ఆహ్వానం
ఎమ్మార్పీఎస్‌ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌ కృష్ణ మాదిగ ఇటీవ‌ల‌ బాత్‌‌రూంలో కాలు జారి పడ‌డంతో బోన్‌‌ ఫ్రాక్చర్ అయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నను వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల క‌లిశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆమె ఫొటో పోస్ట్ చేశారు.

'ఎమ్మార్పీఎస్‌ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు శ్రీ మంద‌ కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన‌ నివాసంలో కలసి ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింది. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించాను. అలాగే, సెప్టెంబ‌రు 12న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తిరుమ‌ల‌గిరిలో నిర్వహించే "ద‌ళిత భేరి" బహిరంగ స‌భ‌కు ఆయ‌న‌ను ఆహ్వానించాను' అని ష‌ర్మిల తెలిపారు.
Go Back to Shorts
Sharmila
YSRTP
Manda Krishna Madiga

More Telugu News