Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనా నుంచి తాలిబ‌న్ల‌కు అందుతున్న నిధుల‌పై జో బైడెన్ స్పంద‌న‌

biden on afghan situation
  • తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య ఉంటుంది
  • ఈ నేప‌థ్యంలోనే దాని పరిష్కారం కోసం చైనా ప్ర‌య‌త్నాలు
  • పాకిస్థాన్, రష్యా, ఇరాన్ కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి
ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబ‌న్లు త‌మ అధీనంలోకి తెచ్చుకున్న నేప‌థ్యంలో వారికి చైనా నుంచి నిధులు అందుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను మీడియా ప్ర‌శ్నించింది. చైనా తీరుపై జో బైడెన్ స్పందిస్తూ... ఆఫ్ఘ‌న్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య ఉంటుంద‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో దాని పరిష్కారం కోసం చైనా ప‌లు ఏర్పాట్లు చేసుకుంటోంద‌ని బైడెన్‌ తెలిపారు. పాకిస్థాన్, రష్యా, ఇరాన్ కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు చైనా కూడా ఈ ప్రయత్నాలు చేస్తోంద‌ని, తాలిబ‌న్ల విష‌యంలో ఇప్పుడేం చేయాలా? అని ఆయా దేశాలు ఆలోచించుకుంటున్నాయ‌ని చెప్పారు.

ఆఫ్ఘ‌న్‌కు చేసే సాయాన్ని అమెరికా ఇప్ప‌టికే నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా, రష్యా వంటి దేశాలు తాలిబన్లకు నిధులు పంపుతాయ‌ని, ఆఫ్ఘ‌న్‌లో నెల‌కొంటోన్న‌ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. తాలిబ‌న్ల‌తో చైనా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఆఫ్ఘ‌న్‌లో తాలిబన్ల పాలనను గుర్తించేందుకు చైనా సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
Joe Biden
USA
Afghanistan
Taliban

More Telugu News