మెగాస్టార్ చేతుల మీదుగా 'క్లాప్' టీజర్ రిలీజ్!

  • ఆది పినిశెట్టి హీరోగా 'క్లాప్'
  • క్రీడా నేపథ్యంలో సాగే కథ
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
  • త్వరలోనే ట్రైలర్ రిలీజ్  
ఆది పినిశెట్టి కథానాయకుడిగా 'క్లాప్' సినిమా రూపొందుతోంది. రామాంజనేయులు - రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, క్రీడా నేపథ్యంలో కొనసాగనుంది. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు.

ఈ టీజర్ లో ఆది పినిశెట్టి అథ్లెట్ గా కనిపిస్తున్నాడు. నేషనల్ లెవెల్లో బంగారు పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంటాడు. అందుకోసం పట్టుదలతో కసరత్తు చేస్తూ కనిపించాడు. కానీ టీజర్ చివరిలో ఆయన రెండు కాళ్లను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా చూపించారు.

ఆది పినిశెట్టి జోడిగా ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ కథానాయికగా అలరించనుంది. ఇక కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. బ్రహ్మాజీ కనిపించనున్నారు. టీజర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేయాలనే మేకర్స్ ప్రయత్నం ఫలించేలానే ఉంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.



More Telugu News

Adhi Pinishetty Aakanksha Singh Prakash Raj