బావమరిదికి బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేశ్
- నేడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు
- అభిమానుల వేడుకలు
- ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
- మోక్షజ్ఞ మనసు బంగారం అని కామెంట్
మోక్షజ్ఞ మనసు బంగారం అంటూ కొనియాడారు. తన కలలు ఫలించాలని కోరుకుంటున్నానని, ఎనలేని ఆనందం, సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, మోక్షజ్ఞ ఇవాళ తన నివాసంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మోక్షజ్ఞ తల్లి వసుంధర కూడా పాల్గొన్నారు.