వరవరరావు బెయిల్ ను పొడిగించిన బాంబే హైకోర్టు
- ఎల్గార్ పరిషద్ కేసులో బెయిల్ పొడిగింపు
- తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించాలన్న పిటిషన్ 24కు వాయిదా
- బెయిల్ షరతుల్లో సడలింపు లభించే అవకాశం ఉందన్న వరవరరావు
ఈ నెల 24 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అంతవరకు (24 వరకు) ముంబైలోనే ఉండాలని పేర్కొంది. వరవరరావుకు ఇంతకు ముందు బెయిల్ ఇచ్చే సమయంలో... ముంబైలోనే ఉండాలంటూ హైకోర్టు షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ముంబైలోనే ఉంటున్నారు. తాజా పిటిషన్ లో కోర్టు షరతులను తాను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల్లో కొంత సడలింపును పొందే అవకాశం తనకు ఉందని వరవరరావు తెలిపారు.