హైదరాబాదులో మరోసారి కుండపోత వాన... నీటమునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి
- ఉప్పొంగుతున్న మూసీ నది
- నదిలోకి వరద నీటి విడుదల
- రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
- అంబర్ పేట్-మూసారాంబాగ్ మార్గంలో నిలిచిన రాకపోకలు
గత కొన్నిరోజులుగా మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చాదర్ ఘాట్, పురానాపూల్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్, శంకర్ నగర్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.