Vinayaka Pooja Kit: ఒక్క క్లిక్ తో పూర్తి వినాయక పూజ కిట్.. వినాయక ప్రతిమ, 21 రకాల పత్రులు, 28 రకాల పూజ వస్తువులు!

 • సురక్షితమైన, సంపూర్ణమైన కిట్ అందిస్తున్న 'ఆరాధ్య'
 • ఆన్ లైన్, ఫోన్ ద్వారా కిట్లు బుక్ చేసుకునే వెసులుబాటు
 • ఆరు నగరాల్లో అందుబాటులో కిట్లు
 • ఒక్కో కిట్ ధర 1,200
 • వినాయకుడి ప్రతిమతో పాటు ప్యాకింగ్ కిట్ వరకు అన్నీ ఎకో ఫ్రెండ్లీనే
Aaradhya online company offering full Vinayaka Pooja Kit online

వినాయకచవితి వస్తోందంటే ఎంతో సందడి మొదలవుతుంది. హిందువులు వినాయక చతుర్థిని ఎంతో భక్తిభావంతో జరుపుకుంటారు. అన్ని విఘ్నాలు తొలగిపోవాలని కోరుతూ గణనాయకుడిని భక్తితో కొలుస్తారు. అయితే వినాయకచవితి జరుపుకోవడం అంటే అంత సులువైన పని కాదు. స్వామి వారి బొమ్మను ప్రతిష్ఠించి, వివిధ రకాల పువ్వులు, పత్రులతో పూజను నిర్వహించడం మన సాంప్రదాయం. దీంతో, వివిధ రకాల పత్రులను సేకరించడం మనకు చాలా కష్టమైన వ్యవహారం. అసలు ఏయే పత్రులు పూజలో వాడాలో అనే విషయంపై కూడా చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు. దీంతో, రోడ్డు పక్కన వ్యాపారులు అమ్మే రకరకాల పత్రులను ఇంటికి తీసుకొచ్చి పూజను పూర్తి చేస్తుంటాం.

మరోవైపు కరోనా కూడా జనాలను భయపెడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, పండగ పూట బయటకు వెళ్లి పూజకు కావాల్సిన సామగ్రిని కొనుక్కురావడం కూడా సమస్యాత్మకమే. పూజ సామగ్రి కోసం వందలాది మంది మార్కెట్లకు వస్తుంటారు. దీంతో, కరోనా భయాలతో బయటకు వెళ్లడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకు 'ఆరాధ్య' ఆన్ లైన్ సంస్థ మరోసారి మన ముందుకు వచ్చింది.

వినాయకచవితిని అందరూ సురక్షితంగా, ప్రశాంతంగా, ఎలాంటి లోటు లేకుండా జరుపుకోవడానికి తమ వంతు బాధ్యతగా 'ఆరాధ్య' మరోసారి సన్నద్ధమయింది. కేవలం ఒక క్లిక్ తో ఒక అడుగు ఎత్తున్న అందమైన మట్టి వినాయకుడి ప్రతిమతో పాటు, 21 రకాల పూజ పత్రులు, పూజకు అవసరమైన 28 రకాల వస్తువులను అందిస్తోంది. ఒక్కో కిట్ ను రూ. 1,200కు అందిస్తోంది.

గత ఏడాది ఈ సదుపాయ కేవలం హైదరాబాద్, విజయవాడ వాసులకు మాత్రమే అందుబాటులో ఉండగా... ఈ ఏడాది గుంటూరు, మంగళగిరి, తిరుపతి, వైజాగ్ ప్రజలకు కూడా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్ లోని వినాయకుడితో పాటు, ప్యాకింగ్ మెటీరియల్ సహా అన్నీ ఎకో ఫ్రెండ్లీ కావడం గమనార్హం. భక్తులకు సంపూర్ణమైన, సురక్షితమైన వినాయకుడి కిట్ ను అందించాలనే ఆలోచనతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వేణుగోపాలస్వామి లంకోతు వేసిన అడుగే 'ఆరాధ్య'. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన 'ఆరాధ్య' అనతికాలంలోనే భక్తుల ఆదరాభిమానాలను చూరగొంది.  
 
ఈ కిట్లను ఆన్ లైన్ ద్వారా లేదా ఫోన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. www.aaradhya.in వెబ్ సైట్లోకి లాగిన్ అయి కిట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839, 9849610015 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కిట్లను బుక్ చేసుకున్న వారు కింద పేర్కొన్న పికప్ పాయింట్ల నుంచి కిట్లను తీసుకోవచ్చు.

పికప్ పాయింట్ల వివరాలు ఇవే:

హైదరాబాద్:

 • జూబ్లీహిల్స్ -  టీ3, థర్డ్ ఫ్లోర్, గ్రీన్ వ్యూ ప్లాజా, రోడ్ నంబర్ 1 & 68
 • మణికొండ - మర్రిచెట్టు జంక్షన్ వద్ద
 • గుడిమల్కాపూర్ - సత్య శోభ అపార్ట్ మెంట్, శారదానగర్ కాలనీ
 • కొండాపూర్ - గ్రీన్ టెర్రేసెస్ అపార్ట్ మెంట్స్, వైట్ ఫీల్డ్స్
 • అమీర్ పేట్ - శ్రీ వాసవి ప్రింటర్స్, ఫస్ట్ ఫ్లోర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా
 • కూకట్ పల్లి - ప్లాట్ నంబర్ 153, రోడ్ నంబర్ 24, వివేకానందనగర్ కాలనీ
 • నిజాంపేట్ - ప్లాట్ నంబర్ 29 & 30, షాప్ నంబర్ 2, సాయిరత్న, శ్రీనివాసనగర్ కాలనీ
 • చందానగర్ - సంగం డెయిరీ పార్లర్, రైల్వే స్టేషన్ రోడ్, ఐసీఐసీఐ ఏటీఎం పక్కన
 • సికింద్రాబాద్ - రైల్ నిలయం పక్కన
 • నాచారం - రిలయన్స్ డిజిటల్ వద్ద, రవీంద్రనగర్
 • ఈసీఐఎల్ - ఏసియన్ రాధిక మల్టిప్లెక్స్ వద్ద, డాక్టర్ ఏఎస్ రావు నగర్ రోడ్
 • కొత్తపేట - విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద
 • రామంతాపూర్ - గుప్తా గార్డెన్స్ వద్ద
 • సుచిత్ర - సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద
 • నల్లగండ్ల - రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద
 • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - ఆర్టీసీ కల్యాణమంటపం వద్ద

విజయవాడ:
 • ఎంజీ రోడ్ - ఫార్మా జనరిక్ హౌస్ వద్ద, రాఘవయ్య పార్క్ రోడ్, గోల్డెన్ పెవిలియన్ ఎదురుగా, గవర్నర్ పేట
 • తాడేపల్లి - ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద

విశాఖపట్నం:
 • ఎన్ఏడీ కొత్త రోడ్డు, ఎన్ఏడీ జంక్షన్
 • డెయిరీ ఫామ్, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద
 • మాధవధార, ఈస్ట్ పార్క్ వద్ద

మంగళగిరి - డీటీడీసీ కార్యాలయం వద్ద
గుంటూరు - విద్యానగర్
తిరుపతి - ఆర్టీసీ బస్టాండ్ వద్ద.

 • Loading...

More Telugu News