నాలుగో టెస్టు: లంచ్ వేళకు ఇంగ్లండ్ స్కోరు 139-5
- లండన్ లో భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు
- 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
- 3 వికెట్లతో రాణించిన ఉమేశ్ యాదవ్
- ఆదుకున్న పోప్, బెయిర్ స్టో
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 53-3తో రెండో రోజు ఆట షురూ చేసిన ఇంగ్లండ్ వెంటవెంటనే మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు ఉమేశ్ యాదవ్ ఖాతాలోకి వెళ్లాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. పేసర్లకు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై భారత్ తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌటైంది.