ఈ నెల 6న 'క్లాప్' టీజర్ రిలీజ్!
- ఆది పినిశెట్టి నుంచి 'క్లాప్' మూవీ
- దర్శకుడిగా పృథ్వీ ఆదిత్య పరిచయం
- ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ
- కీలక పాత్రల్లో నాజర్ .. ప్రకాశ్ రాజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి మేకర్స్ ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ నెల 6వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ - కృష్ణ కురూప్ నటిస్తున్నారు. కీలకమైన పాత్రల్లో నాజర్ .. ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఆది పినిశెట్టి పుంజుకుంటాడేమో చూడాలి.