తెలంగాణలో మరో 340 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 75,102 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 5,891 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 75,102 కరోనా పరీక్షలు నిర్వహించగా, 340 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 42, వరంగల్ అర్బన్ లో 25, నల్గొండ జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. వనపర్తి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 359 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,47,953 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,891 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,872కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News