Telangana: తెలంగాణలో మరికాస్త తగ్గిన రోజువారీ కరోనా కేసులు

Telangana corona cases and mortality details
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 58,335 కరోనా పరీక్షలు
  • 257 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 87 కేసులు
  • 6 వేలకు దిగువన యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా కొత్త కేసులు 300కి లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 58,335 కరోనా పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 87 కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 409 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,47,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు దిగువన నమోదైంది. తాజా గణాంకాల నేపథ్యంలో రాష్ట్రంలో 5,912 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య 3,870కి పెరిగింది.

  • Loading...

More Telugu News