Ram Charan: చెల్లెళ్లతో కలిసి నగరంలో సందడి చేసిన రామ్ చరణ్... ఫొటోలు వైరల్

Ram Charan roaming the city with his younger sister Photos viral
  • రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి
  • సరదాగా చెల్లెళ్లతో లంచ్ కోసం బయటకు వచ్చిన చరణ్
  • మెగాస్టార్ పుట్టినరోజున కూడా కలుసుకున్న అన్నాచెల్లెళ్లు  

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన చెల్లెళ్లతో కలిసి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. వీళ్లంతా కలిసి లంచ్ చేయడం కోసం బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు కెమెరా కంటికి చిక్కారు. వైట్ రౌండ్ నెక్ టీ షర్ట్‌పైన గళ్ల చొక్కా ధరించిన రామ్ చరణ్, సన్ గ్లాసెస్ పెట్టుకొని నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆయనతోపాటు సోదరి నిహారిక కొణిదెల, సుస్మిత కొణిదెల, శ్రీజ కల్యాణ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ భామ అలియా భట్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ తెర పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. కాగా, నిహారిక చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో అలా మెరిశారు. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ పుట్టినరోజు జరుపుకోవడం కోసం వీళ్లంతా చిరంజీవి ఇంట్లో కలుసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు తీసిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
Ram Charan
Tollywood

More Telugu News