Olivia Morris: హైదరాబాద్ వీధుల్లో 'ఆర్ఆర్ఆర్' అందాలభామ షికార్లు

RRR Heroine Olivia Morris enjoys in Hyderabad
  • 'ఆర్ఆర్ఆర్' లో హీరోయిన్ గా ఒలీవియా
  • ఇటీవలే షూటింగ్ పూర్తి
  • కాస్ట్యూమ్ డిజైనర్ తో కలిసి ఒలీవియో ఆస్వాదన
  • ఒలీవియా స్వస్థలం లండన్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్ర హీరోయిన్ ఒలీవియా మోరిస్ హైదరాబాద్ వీధుల్లో హాయిగా షికార్లు చేస్తోంది. శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ, హైదరాబాద్ ఫేమస్ పానీ పూరీలు తింటూ ఎంజాయ్ చేస్తోంది.

ఒలీవియా వెంట 'ఆర్ఆర్ఆర్' చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ అనూరెడ్డి కూడా ఉంది. వీరిద్దరూ జనాలకు పెద్దగా తెలియకపోవడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. తమ షికార్లకు సంబంధించిన ఫొటోలను అనూరెడ్డి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెల్లడైంది.

ఒలీవియా మోరిస్ బ్రిటన్ కు చెందిన నటి. లండన్ లో నాటకాల ద్వారా నటనలో ప్రతిభ చాటిన ఒలీవియా, పలు టెలివిజన్ సిరీస్ ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Olivia Morris
RRR
Hyderabad
Tollywood

More Telugu News