మెహిదీపట్నంలోని ఫార్మసీ కాలేజీలో బీజేపీ కీల‌క నేత‌ల‌తో బండి సంజ‌య్ స‌మావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెహిదీపట్నంలోని ఫార్మసీ కాలేజీలో బీజేపీ కీల‌క నేత‌ల‌తో బండి సంజ‌య్ స‌మావేశం

bandi sanjay meets bjp leaders
  • నిన్న పాద‌యాత్ర ప్రారంభం
  • దాని నిర్వ‌హ‌ణ‌పై దిశా నిర్దేశం చేస్తోన్న బండి సంజ‌య్‌
  • రాష్ట్రంలో బీజేపీని బ‌ల‌ప‌ర్చే అంశంపై చ‌ర్చ‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న‌ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పాదయాత్ర కోసం బీజేపీ ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లు చేసుకుంది. నిన్న హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం వరకు పాద‌యాత్ర కొన‌సాగింది.

నిన్న‌ రాత్రి బండి సంజ‌య్‌తో పాటు ప‌లువురు నేతలు మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేశారు. ఈ రోజు అదే కాలేజీలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ‌, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు, త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు. పాద‌యాత్ర నిర్వ‌హ‌ణ‌తో పాటు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బ‌ల‌ప‌ర్చే అంశాల‌పై బీజేపీ నేత‌ల‌కు బండి సంజ‌య్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News