ఏపీలో కొత్తగా 1,539 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,539 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 243 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 228, కృష్ణా జిల్లాలో 194, నెల్లూరు జిల్లాలో 176 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,140 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,07,730 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,79,504 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,448 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
COVID19
Media Report
New Cases
Deaths

More Telugu News