ఆఫ్ఘనిస్థాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్

Ukraine airplane hijacked in Afghanistan
  • తమ దేశస్తులను తీసుకెళ్లడానికి ఆఫ్ఘనిస్థాన్ కు వచ్చిన ఉక్రెయిన్ విమానం
  • నిన్న విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు
  • ఈరోజు ఇరాన్ కు తీసుకెళ్లిన వైనం
ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారడంతో దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎంతో మంది యత్నిస్తున్నారు. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని... బతుకులు మళ్లీ దుర్భరంగా మారతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. భయపడినట్టుగానే అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. తాలిబన్లు ఓవైపు శాంతి వచనాలు పలుకుతూనే... మరోవైపు ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారు. మహిళలపై షరియా చట్టాల పేరుతో ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ లో ఉక్రెయిన్ కు చెందిన విమానాన్ని హైజాక్ చేయడం కలకలం రేపుతోంది.

తమ దేశ ప్రజలను తీసుకెళ్లేందుకు ఉక్రెయిన్ కు చెందిన విమానం ఆఫ్ఘనిస్థాన్ కు వచ్చింది. అయితే ఆయుధాలతో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ విమానాన్ని హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్ జెనీ యెనిన్ తెలిపారు. విమానాన్ని నిన్న హైజాక్ చేశారని... ఈరోజు దాన్ని దొంగిలించి ఇరాన్ కు తీసుకెళ్లారని చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా తమ దేశస్తులు కాదని... వేరే ప్రయాణికులను తీసుకుని వెళ్లారని తెలిపారు. విమానం హైజాక్ కావడం వల్ల తమ దేశస్తుల తరలింపుకు ఆటంకం కలిగిందని చెప్పారు.
Go Back to Shorts
Afghanistan
Ukraine
Airplane
Hijack

More Telugu News