నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి కేసు.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష
- చాక్లెట్లు కొనుక్కునేందుకు వచ్చిన చిన్నారి
- ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం
- భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిన్న ఈ కేసు తుది విచారణకు రాగా, ఖమ్మం మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ నిందితుడు గణేశ్‌ను దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.