Asha Bhosle: సింగర్ ఆశాభోంస్లే రెస్టారెంట్లో.. హాలీవుడ్ హీరో భోజనం!

Singer Asha Bhosle Restaurant Hollywood Hero Lunch
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశాభోంస్లే బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఆశా’స్ అనే రెస్టారెంట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చడీచప్పుడూ లేకుండా తాజాగా ఈ రెస్టారెంట్‌కు ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ వచ్చారు. సడెన్‌గా రెస్టారెంట్‌కు వచ్చిన టామ్.. హల్ చల్ చేయొద్దని, ప్రశాంతంగా భోజనం చేయడానికి వచ్చానని అక్కడి సిబ్బందికి చెప్పాడట. అలాగే తనను సాధారణ కస్టమర్‌గానే భావించాలని సూచించాడట.

ఆ తర్వాత చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ ఇచ్చిన టామ్.. అది బాగా నచ్చడంతో ఎక్స్‌ట్రా స్పైసీగా ఉండేలా మరో ప్లేటు కూడా ఆర్డర్ ఇచ్చి తిన్నాడట. ఈ విషయం తెలిసిన ఆశాభోంస్లే.. ట్విట్టర్ వేదికగా ఈ సర్‌ప్రయిజ్‌ను బయటపెట్టారు. తన రెస్టారెంట్లో టామ్ క్రూయిజ్ భోజనం చేసినట్లు తెలిసి చాలా సంతోషించానని భోంస్లే ట్వీట్ చేశారు. ఆయన మరోసారి రెస్టారెంటుకు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తుంటానని చెప్పారు. ఈ ట్వీట్‌తోపాటు తన రెస్టారెంట్ నుంచి టామ్ బయటకు వెళ్తున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు.

రెస్టారెంట్లో టామ్ రెండు గంటలపాటు ఉన్నట్లు తెలిపిన మేనేజర్ నోమన్ ఫరూఖీ.. ఆయన భోజనం ముగించి వెళ్లే సమయంలో ఫొటో తీసుకోవడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఆ తర్వాత హోటల్ బయట సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి ఒక ఫొటో దిగిన ఈ యాక్షన్ హీరో..  ఆ తర్వాత మాస్కు తీసేసి మరో ఫొటో దిగినట్లు ఫరూఖీ వెల్లడించారు. కాగా, టామ్ క్రూయిజ్ ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్ 7 ’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 7న ప్రారంభమైంది.
Go Back to Shorts
Asha Bhosle

More Telugu News