కూలిన మంగళగిరి దేవస్థానం ప్రహరీ.. 200 ఏళ్ల చరిత్ర!
- దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిన ప్రహరీ
- శనివారం కురిసిన వర్షాల వల్లేనంటున్న అధికారులు
- శిథిలాల కింద బైక్‌లు, తోపుడు బండ్లు!
దాదాపు 20 అడుగుల పొడవుండే ఈ ప్రహరీని దక్షిణ గాలి గోపురానికి దగ్గరలో రాతితో నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగానే దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిపోయినట్టు చెబుతున్నారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే దేవస్థానం అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాటిని వెలికి తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.