రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కొణిదెల వారి కుటుంబం అంతా ఒక్కచోటికి చేరింది. హైదరాబాదులోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. చిరంజీవితో పాటు ఆయన సోదరులు నాగేంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వారి తోబుట్టువులు విజయదుర్గ, మాధవి రాఖీలు కట్టారు. తమ సోదరుల నుంచి దీవెనలు అందుకున్నారు. మిఠాయిలు పంచుకుని రక్షాబంధన్ పండుగ క్షణాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి, చిరంజీవి అర్ధాంగి సురేఖ కూడా పాల్గొన్నారు.